General Secretary's Message

“అక్షరాల పత్తి ఆరిపోతే విశ్వమంతా గాఢాంధకారమవుతుంది.” అన్నారు. బ్రౌన్ మహాశయుడు.

విద్య అనేది కేవలం నాలుగు గోడల మధ్య సాగే ప్రక్రియ కాదు చదవడం అంటూ తెలిస్తే ప్రతి మనిషి ఒక పుస్తకమే.

మనందరికీ రెండు రకాల విద్య అవసరం. ఒకటి జీవనోపాధి ఎలా కల్పించుకోవాలో నేర్పేది… రెండవది ఎలా జీవించాలో తెలిపేది.

ఇవాళ ప్రపంచాన్ని శాసిస్తున్న సాంకేతిక విద్యను అందరి కంటే మిన్నగా అందిస్తూ…. వివేకవంతమైన విద్యకు విలువల్ని అద్ది… శీల నిర్మాణం, వ్యక్తిత్వ వికాసం… ప్రణాళికాబద్ధమైన బోధనా వ్యవస్థ సెరినిటీ సొంతం.

ప్రగతి పత్రంలో కనిపించే గ్రేడ్లు, పాయింట్లుతోపాటు విద్యార్థుల నైతికాభివృద్ధి కూడా నిత్యబోధనే.

ఎటువంటి ప్రచార ఆర్భాటాలు లేకుండా మా తల్లి దండ్రుల నమ్మకమే పెట్టుబడిగా విద్యార్ధులను అనేక రంగాలలో ప్రతిభావంతులుగా, అనేక విజయాలను సాదిస్తున్న మన సెరినిటీ ఈ సంవత్సరంలో కూడా అనేక నూతన ప్రణాళికలను ఆచరణలోకి తెస్తున్నాము.

ప్రశాంతమైన వాతావరణం, సువిశాలమైన తరగతి గదులు, విశాలమైన క్రీడాప్రాంగణం, నిరంతరం శ్రమించి అంకిత భావంతో పనిచేసే అనుభవజ్ఞులైన అధ్యాపక బృందం మా సొంతం.

చివరగా మహప్రస్థానంలో మరో మజిలి…. నూతన విద్యా సంవత్సరానికి స్వాగతం తెలుపుతూ… అలుపెరగని అకుంఠిత దీక్షతో నిరంతర కృషి చేస్తామని తెలియజేస్తూ…

నిరంతర విద్యా సేవలో…

మీ నోముల వసంత రెడ్డి 

జనరల్ సెక్రటరీ